EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత "సుభాష్ రెడ్డి సేవాభావం". - తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో నీటి సమస్యకు పరిష్కారం.

    Author admin | 17 Nov 2026, 01:25 PM | TELANGANA
    ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత "సుభాష్ రెడ్డి సేవాభావం".  - తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో నీటి సమస్యకు పరిష్కారం.

    - బోరు బావుల ఏర్పాటుకు భూమిపూజ..

    - విద్యార్థులకు క్రికెట్ కిట్లు అందజేత.

    వేగుచుక్క న్యూస్, భిక్నూర్: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ముందుకొచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు క్యాంపస్‌లో బోరు బావుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మహిళా, బాలుర వసతి గృహాల వద్ద బోరు బావుల తవ్వకం కోసం ఆయన భూమిపూజ నిర్వహించారు.

    ఇవి కూడా చదవండి

    *ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ..*

    తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనుకూలంగా ఉందన్నారు. ఒక వ్యక్తి స్థాయిని నిర్ణయించేది అతను చదివిన తరగతి గది మాత్రమేనని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. స్థానికుడిగా క్యాంపస్ అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల నీటి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని బోరు బావులు ఏర్పాటు చేస్తున్న సుభాష్ రెడ్డికి యూనివర్సిటీ ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్‌తో పాటు యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

    అలాగే విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున యుద్ధప్రాతిపదికన క్రికెట్ కిట్లను కూడా అందజేశారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సుభాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. రాజేశ్వరి, హాస్టల్ వార్డెన్లు డా. యాలాద్రి, డా. జి. సునీత, ఏపీఆర్వో డా. సరిత పిట్ల, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు డా. సబిత, డా. ఎస్. నారాయణ, అధ్యాపకులు డా. అంజయ్య బందేల, డా. మోహన్ బాబు, డా. ప్రతిజ్ఞ, డా. హరిత, డా. నాగరాజు, డా. రమాదేవి, దిలీప్, డా. ఇంద్రకరణ్, శ్రీకాంత్ గౌడ్, డా. కనకయ్య, డా. అఫ్రీన్, డా. వెంకటరెడ్డి, విజయ్, డా. సునీల్, డా. సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి