ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత "సుభాష్ రెడ్డి సేవాభావం". - తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో నీటి సమస్యకు పరిష్కారం.

- బోరు బావుల ఏర్పాటుకు భూమిపూజ.. - విద్యార్థులకు క్రికెట్ కిట్లు అందజేత. వేగుచుక్క న్యూస్, భిక్నూర్: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ముందుకొచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు క్యాంపస్‌లో బోరు బావుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మహిళా, బాలుర వసతి గృహాల వద్ద బోరు బావుల తవ్వకం కోసం ఆయన భూమిపూజ నిర్వహించారు. *ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ..* తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనుకూలంగా ఉందన్నారు. ఒక వ్యక్తి స్థాయిని నిర్ణయించేది అతను...