EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి* - టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్. - సీఎస్ కు వినతిపత్రం అందజేసిన నేతలు.

    Author admin | 14 Jul 2026, 07:23 PM | TELANGANA, ఎడ్యుకేషన్
    *2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి*  - టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్.  - సీఎస్ కు వినతిపత్రం అందజేసిన నేతలు.

    వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలనీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి, డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, నూతన ఆరోగ్య పథకం మార్గదర్శకాలను రూపొందించిఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డుల ను విడుదల చేయాలని, పిఆర్సి నీ ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని , ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ను రూపొందించాలని , మోడల్ స్కూల్,గురుకుల, కేజీబీవీ లను విద్యాశాఖలో విలీనం చేసి, టీచర్లకు నూతన ఆరోగ్య పథకం వర్తింపజేయాలని, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు కల్పించాలని, అన్ని యాజమాన్యాల లో ఉన్న ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. లక్ష్మయ్య యాదవ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల బాలయ్య లు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి
    నిజామాబాద్:   ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం...  - మాజీ కౌన్సిలర్  బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం.  - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.

    నిజామాబాద్: ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం... - మాజీ కౌన్సిలర్ బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం. - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.