EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వం 27000 పాఠశాలలను 4 వేలకు కుదించడం అశాస్త్రియం. - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పి ఆర్సి ని వెంటనే ప్రకటించాలి. - టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్.

    Author admin | 10 Jul 2026, 06:01 PM | TELANGANA, ఎడ్యుకేషన్
    ప్రభుత్వం 27000 పాఠశాలలను 4 వేలకు కుదించడం అశాస్త్రియం.  - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పి ఆర్సి ని వెంటనే ప్రకటించాలి.  - టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్.

    వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: ప్రభుత్వం 27000 పాఠశాలలను 4 వేలకు కుదించడం అశాస్త్రియం అని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పిఆర్సి ని వెంటనే ప్రకటించాలనీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ (టిపిటిఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉపాధ్యా శిక్షణ లంచ్ అవరు లో సమావేశంలో నిర్వహించగా, అనిల్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఖండించారు. కొత్త కొత్త పేర్లతో పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించడం అనే అశాస్త్రియ విధానానికి స్వస్తిపలకాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు తమ సర్వీస్ మొత్తంలో ఏఒక్క పదోన్నతిని కూడా పొందకుండా పదవీ విరమణ పొందుతున్నారన్నారు. ప్రతీ ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టును సృష్టించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని కోరారు. 317 బాధితులకు న్యాయం చేయాలని, బదిలీలు పదోన్నతుల ప్రక్రియకు వెంటనే షెడ్యూలు విడుదల చేసి పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పిఆర్సి ఇవ్వకుండా దాటవేస్తూ మూడు సంవత్సరాల కాలం గడిచిందని ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం సరికాదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పిఆర్ సి ని ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ టి. శ్రీనివాస్, శిక్షణ లో ఉన్న టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి
    నిజామాబాద్:   ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం...  - మాజీ కౌన్సిలర్  బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం.  - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.

    నిజామాబాద్: ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం... - మాజీ కౌన్సిలర్ బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం. - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.