EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు.. కనీస వేతనాలు అమలు చేయాలి. - ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య.

    Author admin | 27 Sep 2026, 07:08 PM | TELANGANA
    ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు.. కనీస వేతనాలు అమలు చేయాలి.      - ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయాలనీ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్ (ఇన్స్ట్రక్టర్), ఆయాల జిల్లా స్థాయి సమావేశం ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడానికి, విద్యార్థులను పాఠశాలకు అలవాటు చేయడానికి ప్రీ ప్రైమరీ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీరికి అతి తక్కువ గౌరవ వేతనం నిర్ణయించి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలన్నారు. ఈ సంవత్సరం ఆపాయింట్ చేసిన టీచర్లు ఆయాలను వెంటనే విద్యాశాఖ అధికారి ద్వారా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలని ప్రతినెల 1వ తేదీన వేతనాలు అందించాలన్నారు.

    *రాష్ట్ర కన్వీనర్ చక్రపాణి మాట్లాడుతూ,*

    టీచర్లు ఆయాలు ఐక్యంగా కదలాలని, యూనియన్ ద్వారా మన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ ద్వారా పోరాడుతామని, ఎఐటియుసి నిర్వహించే పోరాటంలో మీరంతా భాగస్వామిలు కావాలని పిలుపునిస్తున్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి సీనియర్ నాయకులు పి. సుధాకర్ ఏఐటియుసి చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇమ్రాన్ అలీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నవత, సుజాత, నీలిమ, జ్యోతి వివిధ మండలాల టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి