EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా సైకిల్ యాత్ర. - ఆర్మూర్‌లో నషా ముక్త్ భారత్‌పై అవగాహన కార్యక్రమం.

    Author admin | 14 Nov 2026, 06:44 PM | TELANGANA
    డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా సైకిల్ యాత్ర.  - ఆర్మూర్‌లో నషా ముక్త్ భారత్‌పై అవగాహన కార్యక్రమం.

    వేగుచుక్క న్యూస్, ఆర్మూర్: డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ ఇందుకూరి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. 'నషా ముక్త్ భారత్' లక్ష్యంతో భీమవరం నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన డాక్టర్ ఇందుకూరి విజయలక్ష్మి, తన యాత్రలో భాగంగా ఆర్మూర్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ జిల్లా, ఆర్మూర్ నగరం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

    విద్యార్థులకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి బానిసలుగా మారకుండా ఉండాలని అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

    అనంతరం విశ్వ హిందూ పరిషత్ ఆర్మూర్ నగరం ఆధ్వర్యంలో డాక్టర్ ఇందుకూరి విజయలక్ష్మిని ఘనంగా సన్మానించి, భీమవరం నుంచి ఢిల్లీ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో నగర సంఘ చాలక్ పోల్కం నారాయణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ అల్జపూర్ అక్షయ్, నగర ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సత్సంగ్ ప్రముఖ్ యోగేష్, బలోపాసన ప్రముఖ్ సాయి, బజరంగ్ రిషి తదితర బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి