డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా సైకిల్ యాత్ర. - ఆర్మూర్‌లో నషా ముక్త్ భారత్‌పై అవగాహన కార్యక్రమం.

వేగుచుక్క న్యూస్, ఆర్మూర్: డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ ఇందుకూరి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. 'నషా ముక్త్ భారత్' లక్ష్యంతో భీమవరం నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన డాక్టర్ ఇందుకూరి విజయలక్ష్మి, తన యాత్రలో భాగంగా ఆర్మూర్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ జిల్లా, ఆర్మూర్ నగరం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి బానిసలుగా మారకుండా ఉండాలని అవగాహన కల్పించారు. యువత మత్తు...