EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతు సంఘం 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి..సిఐటియు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపు.

    Author admin | 14 Nov 2026, 06:41 PM | TELANGANA
    రైతు సంఘం 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి..సిఐటియు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపు.

    - ఈ నెల 15న లక్షలాదిమంది రైతులతో నల్గొండలో మహా ప్రదర్శన.

    వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: నల్గొండ జిల్లాలో జరిగే 36వ అఖిల భారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రైతులు, కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 15 న మొదటి (ఆదివారం) నల్లగొండ పట్టణంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ బహిరంగ సభకు జిల్లాలోని రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గత 12 సంవత్సరాల కాలంలో దేశంలో వ్యవసాయ రంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా ప్రైవేటీకరణ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 70 శాతానికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభాను కాదని, దేశంలోని బడా కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మొదటిరోజు బహిరంగ సభ, మిగతా మూడు రోజులపాటు ప్రతినిధుల సభలు ఉంటాయని అన్నారు. ఈ సభలో దేశంలో వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల విధానాలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రత్యామ్నాయ విధానాలపై సమగ్ర చర్చ ఉంటుందని తెలిపారు. మహాసభలలో భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొని పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుందని అన్నారు.

    అత్యధికంగా చదివినవి