రైతు సంఘం 36వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి..సిఐటియు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపు.
- ఈ నెల 15న లక్షలాదిమంది రైతులతో నల్గొండలో మహా ప్రదర్శన. వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: నల్గొండ జిల్లాలో జరిగే 36వ అఖిల భారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రైతులు, కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల 15 న మొదటి (ఆదివారం) నల్లగొండ పట్టణంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ బహిరంగ సభకు జిల్లాలోని రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గత 12...