EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిజామాబాద్ మార్కెట్లోకి... ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ బైక్‌లు.షోరూంను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ.

    Author admin | 11 Nov 2026, 11:04 PM | TELANGANA
    నిజామాబాద్ మార్కెట్లోకి... ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ బైక్‌లు.షోరూంను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ.

    - ఆర్యనగర్‌లో ఓబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ షోరూం ప్రారంభం.

    - తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం.. యువతలో పెరుగుతున్న ఆసక్తి.

    నిజామాబాద్ మార్కెట్లోకి... ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ బైక్‌లు.షోరూంను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ. - Additional Image

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటివరకు మార్కెట్లో ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటీలు అందుబాటులో ఉండగా, తాజాగా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు కూడా వాహనదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఓబెన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ షోరూం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది.

    నగరంలోని ఆర్యనగర్‌లో శ్రీనివాస్ ఈ మోటార్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ షోరూంను బుధవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న ప్రస్థుత తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో మేలని అన్నారు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ఓబెన్ కంపెనీ ఎలక్ట్రిక్ బైకులు తీసుకురావడం అభినందనీయం అన్నారు. జిల్లాలో తొలిసారిగా ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేక షోరూం అందుబాటులోకి రావడంతో వాహనదారులు, ముఖ్యంగా యువత ఆసక్తి చూపుతున్నారు.

    నిజామాబాద్ మార్కెట్లోకి... ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ బైక్‌లు.షోరూంను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ. - Additional Image

    దేశవ్యాప్తంగా ఓబెన్ బైక్‌లకు యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోందని కంపెనీ ప్రతినిధులు సౌత్ జెడ్ ఎస్ఎం మంజునాథ్ పాటిల్ తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    *ఈ సందర్భంగా షోరూం యజమాని శ్రీనివాస్ మాట్లాడుతూ..*

    నిజామాబాద్ మార్కెట్లోకి... ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ బైక్‌లు.షోరూంను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ. - Additional Image

    ఎలాంటి కాలుష్యం లేకుండా, తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల ప్రత్యేకత అని తెలిపారు. ఓబెన్ బైక్‌ల ఎక్స్‌షోరూం ధర సుమారు రూ.1.45 లక్షల నుంచి ప్రారంభమవుతుందని, ఇన్సూరెన్స్ తదితర ఖర్చులతో కలిపి సుమారు రూ.1.65 లక్షల వరకు ఉంటుందని వివరించారు. స్మార్ట్ ఐక్యూ మోడల్ ధర అదనంగా ఉంటుందని పేర్కొన్నారు.

    బ్యాటరీపై ప్రామాణికంగా మూడేళ్లు లేదా 40 వేల కిలోమీటర్ల వారంటీ అందిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల అవసరాన్ని బట్టి ఐదేళ్లు లేదా 60 వేల కిలోమీటర్లు, ఎనిమిదేళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీ పొందే అవకాశం ఉందన్నారు.

    ప్రస్తుతం పెట్రోల్ ధరలు లీటరుకు రూ.100 దాటుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్‌లు ఆర్థికంగా ఎంతో అనుకూలమని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇంటి వద్దే బైక్‌ను చార్జింగ్ చేసుకోవచ్చని, నెలకు విద్యుత్ బిల్లు సుమారు రూ.200 నుంచి రూ.300 లోపే ఉండే అవకాశం ఉందని తెలిపారు. పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.

    పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థికంగా పొదుపు కోరుకునే వాహనదారులకు ఓబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని షోరూం నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

    అత్యధికంగా చదివినవి