నిజామాబాద్ మార్కెట్లోకి... ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎలక్ట్రిక్ బైక్‌లు.షోరూంను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ.

- ఆర్యనగర్‌లో ఓబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ షోరూం ప్రారంభం. - తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం.. యువతలో పెరుగుతున్న ఆసక్తి. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటివరకు మార్కెట్లో ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటీలు అందుబాటులో ఉండగా, తాజాగా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు కూడా వాహనదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఓబెన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ షోరూం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. నగరంలోని ఆర్యనగర్‌లో శ్రీనివాస్ ఈ మోటార్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ షోరూంను బుధవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. పెట్రోల్, డీజిల్ ధరలు...