EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్‌గా... "మానకొండ రవికుమార్" ప్రమాణ స్వీకారం.

    Author admin | 11 Nov 2026, 10:58 PM | TELANGANA
    నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్‌గా... "మానకొండ రవికుమార్" ప్రమాణ స్వీకారం.

    - ఆలయ కమిటీ సభ్యులు, సలహాదారుల బాధ్యతల స్వీకరణ.

    - సిద్ధుల గుట్ట అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు మంజూరు.

    నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్‌గా... "మానకొండ రవికుమార్" ప్రమాణ స్వీకారం. - Additional Image

    - త్వరలో పెద్ద షెడ్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ.

    - ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

    నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్‌గా... "మానకొండ రవికుమార్" ప్రమాణ స్వీకారం. - Additional Image

    వేగుచుక్క న్యూస్, ఆర్మూర్: పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్‌గా మానకొండ రవికుమార్ (జిమ్మీ రవి) ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య సలహాదారులు, సలహాదారుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులుగా ప్రొద్దుటూరి చరణ్ రెడ్డి, హాజరి సతీష్, చెందేశి శ్రీనివాస్, కొంతం మంజుల మురళి ప్రమాణ స్వీకారం చేశారు.

    ఇవి కూడా చదవండి

    ముఖ్య సలహాదారులుగా భారత్ గ్యాస్ సుమన్, మల్లయ్య కొడిదేల, శంకర్ బట్టు నియమితులయ్యారు. సలహాదారులుగా రామా గౌడ్ (దున్నాల), గంగా రెడ్డి (పడకంటి), చక్రవర్తి బాధ్యతలు స్వీకరించారు.

    నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్‌గా... "మానకొండ రవికుమార్" ప్రమాణ స్వీకారం. - Additional Image

    *అనంతరం ముఖ్య అతిథి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..*

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నవనాథ సిద్ధుల గుట్టలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా సుమారు రూ.25 లక్షల వ్యయంతో అన్నదాన కార్యక్రమానికి షెడ్, రెండు గదులు, కార్యాలయ గది, రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు, వాటికి షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

    టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సిద్ధుల గుట్టను సందర్శించిన సందర్భంగా పెద్ద షెడ్ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా నిలిచిపోయిన రోడ్డు పనులను తిరిగి ప్రారంభించి, అక్కడి నుంచి కోనేరు వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా త్వరలో భూమిపూజ చేస్తామని వెల్లడించారు.

    ఈ కార్యక్రమంలో అతిథులుగా మార చంద్రమోహన్, సాయి బాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, వైస్ చైర్మన్ పెద్దకటి పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, జీవన్, సదాశివ్, లింగ గౌడ్, వాసు, వెంకట్ రామ్ రెడ్డి, కౌన్సిలర్లు డార్లింగ్ రమేష్, భూపేందర్, శాల ప్రసాద్, గంగూలీ గౌడ్, నర్మె నవీన్, రేగుళ్ల సత్యం, అజ్జు భాయ్, మురళి, పస్కా నర్సయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు, నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి