EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.

    Author admin | 27 Sep 2026, 07:14 PM | TELANGANA
    ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, సెప్టెంబర్ 27 : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, అదనపు కలెక్టర్ భుజంగరావు, బీ.సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
    అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గళమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, తెలంగాణ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ కొనసాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయి కుమార్, పద్మశాలి, బీసీ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

    ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. - Additional Imageఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. - Additional Image
    అత్యధికంగా చదివినవి