ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్, సెప్టెంబర్ 27 : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, అదనపు కలెక్టర్ భుజంగరావు, బీ.సి, పద్మశాలి కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు వినాయకనగర్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుది శ్వాస వరకు అంకితభావం, నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారు కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలోనే...