EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం". 50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి.

    Author admin | 27 Sep 2026, 12:04 PM | TELANGANA
    యాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం".  50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి.

    వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: యాభై ఏళ్లుగా..పీడిత "జనం కోసమే విమలక్క గళం" కొనసాగుతుందని, సమాజంలో వివక్షను రూపుమపేది, హక్కులను కాపాడేది కళా రూపాలేనని పలువురు సామాజిక వేత్తలు, రచయితలు, కళాకారులు ప్రశంసించారు. యాభై రెండేళ్ల అరుణోదయ సంస్థలో యాభై ఏళ్ల విమలక్క ప్రస్థానం సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో '50 గంటలు ఏకధాటిగా పాట- ఆట- మాట' పేరుతో కార్యక్రమాన్ని కళాకారులు ప్రారంభించారు. ఈ సభలో దిల్లీకి చెందిన ప్రముఖ రచయిత్రి, సీనియర్ పాత్రికేయురాలు బాషా సింగ్ మాట్లా డుతూ.. 'నేటి పాలకులు ప్రజా వ్యతిరేక సంస్కృతిని ప్రోత్సహిస్తూ.. దాన్ని బలవంతంగా రుద్దుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే తత్వం పెరగాలనీ, ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా యువత ముందుకు రావాలి' అని పిలుపునిచ్చారు.

    *'ప్రజా సంస్కృతివైపు నిలబడటం అంటే నేడు నిరంతర యుద్ధమే..*

    యాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం".  50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి. - Additional Image

    ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, కట్టా భగవంత్ రెడ్డి, జయధీర్ తిరుమలరావు, చక్రధర్రావు, వినయ్ బాబు, లక్ష్మి, సినీ దర్శకులు నరసింగ రావు, ఉమామహేశ్వర్రావు, శంకర్ లు మాట్లాడుతూ..
    'ప్రజా సంస్కృతివైపు నిలబడటం అంటే నేడు నిరంతరం యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఎంతటి క్లిష్ట పరిస్థితులే దురైనా వెన్నుచూపకుండా విమలక్క ప్రజల తరపున యుద్ధం చేస్తున్నారనీ అన్నారు. ఆమె 50 ఏళ్లుగా ప్రజా పోరాటానికి అంకితమై ఉండటం గొప్ప విషయం అన్నారు. ప్రస్తుతం సామ్రాజ్యవాద విష సంస్కృతి అనేక రూపాల్లో ప్రజల ముందుకు వస్తోందన్నారు. జానపద కళారూపాలు ప్రజల గుండె చప్పుడు. వాటిని ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    *'పోరు పాట' పుస్తకం ఆవిష్కరణ.*

    యాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం".  50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి. - Additional Image

    విమలక్క ప్రస్థానంపై ముద్రించిన 'పోరు పాట' పుస్తకాన్ని రచయిత్రి జూపాక సుభద్ర ఆవిష్కరించారు. రచయిత జయరాజు, అంబిక, అరుణక్క, శోభారాణి, డాక్టర్ శంకర్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

    *కొనసాగుతున్న ధూంధాం*

    యాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం".  50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి. - Additional Image

    50 గంటల ఏకథాటి కళారూపాల ప్రదర్శనను విమలక్క ప్రత్యేక పాటతో ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల పాటలు, ఆటలతో ధూందాం కొనసాగుతోంది. గంగిరెద్దుల ప్రదర్శన, థింసా, గుస్సాడీ తదితర నృత్యాలు ఆకట్టుకుంటు న్నాయి. ఈ ప్రదర్శన సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ముగియనుంది.

    యాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం".  50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి. - Additional Imageయాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం".  50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి. - Additional Image
    అత్యధికంగా చదివినవి