యాభై ఏళ్లుగా.. "జనం కోసమే విమలక్క గళం". 50 గంటల.. పాట- ఆట- మాట కార్యక్రమంలో వక్తల వెల్లడి.

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: యాభై ఏళ్లుగా..పీడిత "జనం కోసమే విమలక్క గళం" కొనసాగుతుందని, సమాజంలో వివక్షను రూపుమపేది, హక్కులను కాపాడేది కళా రూపాలేనని పలువురు సామాజిక వేత్తలు, రచయితలు, కళాకారులు ప్రశంసించారు. యాభై రెండేళ్ల అరుణోదయ సంస్థలో యాభై ఏళ్ల విమలక్క ప్రస్థానం సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ లో '50 గంటలు ఏకధాటిగా పాట- ఆట- మాట' పేరుతో కార్యక్రమాన్ని కళాకారులు ప్రారంభించారు. ఈ సభలో దిల్లీకి చెందిన ప్రముఖ రచయిత్రి, సీనియర్ పాత్రికేయురాలు బాషా సింగ్ మాట్లా డుతూ.. 'నేటి పాలకులు ప్రజా వ్యతిరేక సంస్కృతిని ప్రోత్సహిస్తూ.. దాన్ని బలవంతంగా రుద్దుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే తత్వం పెరగాలనీ,...