EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 8న రెడ్ల నిరసన దీక్ష. విజయవంతం చేయాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి పిలుపు.

    Author admin | 03 Sep 2026, 10:22 PM | Politics, TELANGANA
    8న రెడ్ల నిరసన దీక్ష.   విజయవంతం చేయాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక  స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి   పిలుపు.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: రెడ్డి కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల నిధి తో పాటు వెంటనే పాలకవర్గం ఏర్పాటు చేయాలని వేలాదిమందితో ఈ నెల 8న ఇందిరాపార్క్, హైదరాబాద్ లో జరుగబోయే " రెడ్ల నిరసన దీక్ష " పెద్ద ఎత్తున తరలిరావాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను గురువారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మాటిచ్చి మరచి పోయిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేయడానికే దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. తమ సామాజిక వర్గంలోని పేద రెడ్లకు న్యాయం జరగాలన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి కాకుండా, బీసీ, ఎస్సి సామాజిక వర్గ చెందిన వారు ముఖ్యమంత్రిగా రావాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాం అని అన్నారు. ఈ మార్పు వల్ల తమ పేద రెడ్లకు కావచ్చు, అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అన్నారు.

    రెడ్డి కార్పొరేషన్ తో పాటు రైతు భీమా పథకం కొనసాగించాలన్నారు. ఈ డబ్ల్యూఎస్ పదిశాతం రిజర్వేషన్ ను అన్ని ప్రభుత్వ విభాగాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని, మన పిల్లల భవిష్యత్ కోసమే చేస్తున్న దీక్ష కు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రెడ్డి కుటుంబం నుండి ఒకరు రావాలని కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గాదరీ సంజీవరెడ్డి సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సుదర్శనరెడ్డి,రమేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి