8న రెడ్ల నిరసన దీక్ష. విజయవంతం చేయాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి పిలుపు.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: రెడ్డి కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల నిధి తో పాటు వెంటనే పాలకవర్గం ఏర్పాటు చేయాలని వేలాదిమందితో ఈ నెల 8న ఇందిరాపార్క్, హైదరాబాద్ లో జరుగబోయే " రెడ్ల నిరసన దీక్ష " పెద్ద ఎత్తున తరలిరావాలని రెడ్డి సంఘాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను గురువారం నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మాటిచ్చి మరచి పోయిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేయడానికే దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. తమ సామాజిక వర్గంలోని పేద రెడ్లకు న్యాయం జరగాలన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి...