EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిజామాబాద్: ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం... - మాజీ కౌన్సిలర్ బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం. - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.

    Author admin | 05 Aug 2026, 05:27 PM | TELANGANA
    నిజామాబాద్:   ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం...  - మాజీ కౌన్సిలర్  బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం.  - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: గాజుల్ పేట్ మాజీ కౌన్సిలర్, విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం మాజీ అధ్యక్షులు బెల్లాల్ పోతన్న(80) అంత్యక్రియల్లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. బుధవారం గాజుల్ పేట్ లో నిర్వహించిన ఆయన అంతిమయాత్రకు రాజకీయ ప్రముఖులు పార్టీల తేడాలను, వైషమ్యాలను పూర్తిగా పక్కనబెట్టి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఆకుల లలిత, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, రైతు కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి తదితరులు ఈ అంత్యక్రియల్లో పాల్గొని పోతన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. "ఆపద వస్తే అందరం ఒక్కటవుతాం" అనే సంకేతాన్ని ఇస్తూ, ఒకే వేదికపై విభిన్న పార్టీల అగ్రనేతలు నిలబడి పోతన్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

    నిజామాబాద్:   ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం...  - మాజీ కౌన్సిలర్  బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం.  - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు. - Additional Image
    అత్యధికంగా చదివినవి