నిజామాబాద్: ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం... - మాజీ కౌన్సిలర్ బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం. - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: గాజుల్ పేట్ మాజీ కౌన్సిలర్, విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం మాజీ అధ్యక్షులు బెల్లాల్ పోతన్న(80) అంత్యక్రియల్లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. బుధవారం గాజుల్ పేట్ లో నిర్వహించిన ఆయన అంతిమయాత్రకు రాజకీయ ప్రముఖులు పార్టీల తేడాలను, వైషమ్యాలను పూర్తిగా పక్కనబెట్టి హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఆకుల లలిత, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, రైతు కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ డీసీసీ అధ్యక్షులు...