EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిజామాబాద్: భర్త, అత్తను హతమార్చేందుకు నయా ప్లాన్. - మీల్ మేకర్ "కూరలో గడ్డి మందు" కలిపి వండింది. - వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కుట్ర.

    Author admin | 03 Aug 2026, 10:17 PM | TELANGANA, నిజామాబాద్
    నిజామాబాద్:  భర్త, అత్తను హతమార్చేందుకు నయా ప్లాన్.  - మీల్ మేకర్ "కూరలో గడ్డి మందు" కలిపి వండింది.  - వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కుట్ర.

    - అత్తకు తీవ్ర అస్వస్థత, భర్తకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.

    - నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు.

    - నిజామాబాద్ జిల్లా, ముదక్ పల్లిలో ఘటన.

    ఇవి కూడా చదవండి

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: నేటి సమాజంలో భర్తలను ఎలా చంపాలో... ఎన్ని ప్లాన్స్ వేస్తున్నారో నిత్యం చూస్తున్నాం. అదే కోవలో మరో ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను హతమార్చేందుకు కూరలో గడ్డి మందు కలిపింది. కూర తిన్న అత్త అస్వస్థతకు గురికాగా, కూర వాసన రావడం వల్ల భర్త తినకపోవడంతో తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. మోపాల్ ఎస్ఐ సుష్మిత వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మోపాల్ మండలం, ముదక్ పల్లికి చెందిన పొట్టోళ్ల సోని అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని, తన భర్త భూమన్న, అత్త భూదేవ్వలను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. దీనితో ఈ నెల 1న ఇంట్లో వండిన మీల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపింది. మధ్యాహ్న సమయంలో అత్త భూదేవ్వ ఆ కూరతో భోజనం చేయడంతో తీవ్ర వాంతులు, విరేచనాలకు గురయ్యారు. అనంతరం భర్త భూమన్న అదే కూరను తినే సమయంలో పురుగుమందు వంటి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి వెంటనే తినడం ఆపేశాడు. అయినప్పటికీ ఆయనకు తలతిరగడంతో స్థానికులు ఇద్దరినీ జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అనంతరం అనుమానంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఆమె స్వచ్ఛందంగా నేరాన్ని అంగీకరించినట్లు ఎస్ఐ సుష్మిత తెలిపారు. ఈ మేరకు సోమవారం నిందితురాలు పొట్టోళ్ల సోనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచినట్టు వివరించారు.

    అత్యధికంగా చదివినవి