నిజామాబాద్: భర్త, అత్తను హతమార్చేందుకు నయా ప్లాన్. - మీల్ మేకర్ "కూరలో గడ్డి మందు" కలిపి వండింది. - వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కుట్ర.

- అత్తకు తీవ్ర అస్వస్థత, భర్తకు తృటిలో తప్పిన ప్రాణాపాయం. - నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు. - నిజామాబాద్ జిల్లా, ముదక్ పల్లిలో ఘటన. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: నేటి సమాజంలో భర్తలను ఎలా చంపాలో... ఎన్ని ప్లాన్స్ వేస్తున్నారో నిత్యం చూస్తున్నాం. అదే కోవలో మరో ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త, అత్తను హతమార్చేందుకు కూరలో గడ్డి మందు కలిపింది. కూర తిన్న అత్త అస్వస్థతకు గురికాగా, కూర వాసన రావడం వల్ల భర్త తినకపోవడంతో తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. మోపాల్ ఎస్ఐ సుష్మిత వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మోపాల్ మండలం,...