EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టీయూ సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ "డాక్టర్ రమాదేవి" ఔదార్యం. - తన జీతం నుండి యూనివర్సిటీ లైబ్రరీకి పోటీ పరీక్షల మెటీరియల్ ..

    టీయూ సౌత్ క్యాంపస్  అసిస్టెంట్ ప్రొఫెసర్ "డాక్టర్ రమాదేవి" ఔదార్యం.  - తన జీతం నుండి యూనివర్సిటీ లైబ్రరీకి  పోటీ పరీక్షల మెటీరియల్ ..

    - పీజీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.

    - ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ చేతులమీదుగా అందజేత.

    టీయూ సౌత్ క్యాంపస్  అసిస్టెంట్ ప్రొఫెసర్ "డాక్టర్ రమాదేవి" ఔదార్యం.  - తన జీతం నుండి యూనివర్సిటీ లైబ్రరీకి  పోటీ పరీక్షల మెటీరియల్ .. - Additional Image

    వేగుచుక్క న్యూస్, బిక్నూర్: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి తమ ఔదార్యం చాటారు. యూనివర్సిటీ లైబ్రరీకి పిజి విద్యార్థుల సౌకర్యార్థం తదుపరి ఉన్నత చదువు, ఉద్యోగం కోసం అవసరమైన పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను డాక్టర్ రమాదేవి అందజేశారు. సోమవారం ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ చేతులమీదుగా లైబ్రరీ అధికారి శ్రీకాంత్ కు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, నెట్, సెట్ కోసం చదివే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందివ్వడం గొప్ప విషయమని అన్నారు. డా. రమాదేవి విద్యార్థుల ప్రయోజనం కోసం తన సొంత జీతంలో నుంచి తీసి పుస్తకాలు కొని ఇవ్వడం చాలా అభినందించ తగ్గ విషయం అన్నారు. విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకొని పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని కోరారు.

    ఇవి కూడా చదవండి

    *డా.రమాదేవి మాట్లాడుతూ,*

    కొత్త సిలబస్ కు అనుగుణంగా పుస్తకాలను విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. ఈ పుస్తకాలు కొనాలంటే విద్యార్థులకు ఆర్థిక భారం అవుతుంది కాబట్టి వాటిని లైబ్రరీ లో అందుబాటులో ఉంచాలని అనుకున్నామని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు వాడుకొని మరింత ఙ్ఞానాన్ని పెంచుకోవాలని, తద్వారా పోటీ పరీక్షల లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. పుస్తకాల ఏర్పాటులో సహకరించిన డా.సంతోష్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
    కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి, హాస్టల్ వార్డెన్ డా.సునీత, డా.అంజయ్య, పి ఆర్ ఓ డా. సరిత పిట్ల, డా.ఎస్.నారాయణ,డా.నర్సయ్య, శ్రీకాంత్ గౌడ్, కిషన్, డా.వెంకట రెడ్డి,డా. అఫ్రీన్, డా.కనకయ్య, శ్రీనివాస్, డా.పోతన్న, డా.విజయ్, డా.మహిపాల్, డా.సునీల్ ,లైబ్రేరియన్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి
    నిజామాబాద్:   ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం...  - మాజీ కౌన్సిలర్  బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం.  - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.

    నిజామాబాద్: ఆపద వస్తే ... అందరం ఒక్కటవుతాం... - మాజీ కౌన్సిలర్ బెల్లాల్ పోతన్న అత్యక్రియల్లో అరుదైన దృశ్యం. - పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల హాజరు.