టీయూ సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ "డాక్టర్ రమాదేవి" ఔదార్యం. - తన జీతం నుండి యూనివర్సిటీ లైబ్రరీకి పోటీ పరీక్షల మెటీరియల్ ..

- పీజీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. - ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ చేతులమీదుగా అందజేత. వేగుచుక్క న్యూస్, బిక్నూర్: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి తమ ఔదార్యం చాటారు. యూనివర్సిటీ లైబ్రరీకి పిజి విద్యార్థుల సౌకర్యార్థం తదుపరి ఉన్నత చదువు, ఉద్యోగం కోసం అవసరమైన పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను డాక్టర్ రమాదేవి అందజేశారు. సోమవారం ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ చేతులమీదుగా లైబ్రరీ అధికారి శ్రీకాంత్ కు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, నెట్, సెట్ కోసం చదివే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందివ్వడం గొప్ప విషయమని అన్నారు. డా. రమాదేవి విద్యార్థుల ప్రయోజనం కోసం తన సొంత...