EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి.. - ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ బి. కిషోర్ రెడ్డి.

    Author admin | 01 Aug 2026, 11:47 PM | TELANGANA
    సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి..  - ఊపిరితిత్తులు, శ్వాసకోశ  వ్యాధుల నిపుణులు  డాక్టర్ బి. కిషోర్ రెడ్డి.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ డాక్టర్ బి. కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఖలీల్ వాడిలో, హోప్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కిషోర్ రెడ్డి చెస్ట్ మరియు ఎలర్జీ క్లినిక్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి తో సీజనల్ వ్యాధులపై వేగుచుక్క న్యూస్ సలహాలు, సూచనల కోరుతూ ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది.


    *వేగుచుక్క న్యూస్: వర్షకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులు ఏమిటి ?.*

    సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి..  - ఊపిరితిత్తులు, శ్వాసకోశ  వ్యాధుల నిపుణులు  డాక్టర్ బి. కిషోర్ రెడ్డి. - Additional Image


    *డాక్టర్ బి. కిషోర్ రెడ్డి:*

    వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులు జలుబు, దగ్గు, గొంతు నొప్పి. ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు, తుమ్పులు. అలాగే
    గ్యాస్ట్రోఎంటరైటిస్ (విరేచనాలు), వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, డీహైడ్రేషన్.

    సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి..  - ఊపిరితిత్తులు, శ్వాసకోశ  వ్యాధుల నిపుణులు  డాక్టర్ బి. కిషోర్ రెడ్డి. - Additional Image

    డేంగ్యూ: అత్యధిక జ్వరం, తలనొప్పి, కళ వెనుక నొప్పి, కండరాల నొప్పి, దద్దుర్లు.

    టైఫాయిడ్ : నిద్రమత్తు, జ్వరం, కడుపునొప్పి, తలనొప్పి, ఆకలి తగ్గడం.

    జాండిస్ (కాలేయ వ్యాధులు): కట్టు, చర్మం పసుపు రంగు రావడం, మూత్రం గాఢంగా మారడం, జ్వరం.

    ఇవి కూడా చదవండి

    చర్య వ్యాధులు: దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఇచింగ్.

    కర్ణం ఇన్ఫెక్షన్లు: చెవినొప్పి, వినికిడి తగ్గడం, జ్వరం వస్తుంది.

    కంటి ఇన్ఫెక్షన్లు: కంటి ఎర్రదనం, నీరు కారడం, కంటిలో మంట, చూపు ఇబ్బంది.

    ఆస్తమా అండ్ అలర్జీలు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, దమ్ము, ఛాతిలో బిగుతు మొదలైన వ్యాధులు సోకే అవకాశం ఉంది.

    *వేగుచుక్క న్యూస్: వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.*

    *డాక్టర్ బి. కిషోర్ రెడ్డి:*
    శుభ్రమైన నీరు మాత్రమే తాగాలి. ఆహారాన్ని, బాగా ఉడికించి తినాలి. మురికి నీటి నుండి దూరంగా, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దోమల కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి. తగినంత విశ్రాంతి , పోషకాపోరం తీసుకోవాలి.

    వేగుచుక్క న్యూస్: వైద్యులను
    ఎప్యుడు సంప్రదించాలి?.

    *డాక్టర్ బి. కిషోర్ రెడ్డి:*
    జ్వరం, దగ్లు, విరేచనాలు ఎక్చువైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
    జ్యరం 2 రోజులకు మించినప్పుడు, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది,
    అధిక దగ్గు/రక్తంతో దగ్గు,
    విరేచనాలు ఆగకపోవడం,
    అత్యధిక అలసట, నీరసం మొదలైన లక్షణాలు ఉంటే
    తక్షణ వైద్య సహాయం అవసరం.

    అత్యధికంగా చదివినవి