సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి.. - ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ బి. కిషోర్ రెడ్డి.

వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ డాక్టర్ బి. కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఖలీల్ వాడిలో, హోప్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కిషోర్ రెడ్డి చెస్ట్ మరియు ఎలర్జీ క్లినిక్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి తో సీజనల్ వ్యాధులపై వేగుచుక్క న్యూస్ సలహాలు, సూచనల కోరుతూ ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. *వేగుచుక్క న్యూస్: వర్షకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులు ఏమిటి ?.* *డాక్టర్ బి. కిషోర్ రెడ్డి:* వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులు జలుబు, దగ్గు, గొంతు నొప్పి. ముక్కు కారడం,...