EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాన్సువాడ: ఐదుగురు బాలింతలు అస్వస్థతపై ప్రభుత్వం సీరియస్. - ఇద్దరు నర్సులు సస్పెండ్, అనస్థీషియా డాక్టర్ విధుల నుంచి తొలగింపు.

    Author admin | 28 Jul 2026, 07:33 PM | TELANGANA
    బాన్సువాడ:  ఐదుగురు బాలింతలు అస్వస్థతపై ప్రభుత్వం సీరియస్.  - ఇద్దరు నర్సులు సస్పెండ్, అనస్థీషియా డాక్టర్ విధుల నుంచి తొలగింపు.

    వేగుచుక్క న్యూస్: బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారని ఉన్నత అధికారుల విచారణలో తేలింది. దీనితో ప్రభుత్వ ఘటనకు బాధ్యులుగా ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయగా, అనస్థీషియా డాక్టర్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత 15 రోజుల క్రితం శుక్ర, శనివారాల్లో చేసిన 10 సిజెరియన్లలో 5గురు బాలింతలు ఆపరేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నిర్ధారించారు. విచారణ నివేదిక ప్రకారం శస్త్రచికిత్సా పరికరాలు, లినెన్ సరైన స్టెరిలైజేషన్ లేకపోవడం వల్ల కాలుష్యం జరిగే అధిక సంభావ్యత ఉందని, సెప్సిస్కు ఇదే ప్రధాన కారణమని స్పష్టమవుతోందని విచారణ లో తేలింది. ఆపరేషన్ థియేటర్లలో, శస్త్రచికిత్సలలో ఉపయోగించే వస్తువులలో కఠినమైన సెప్టిక్ పరిస్థితులను పాటించడంలో జరిగిన లోపంగా తేల్చారు.

    *నిమ్స్ లో ప్రత్యేక బృందంతో చికిత్స...*
    *
    వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగు ఆదేశాలతో ఇప్పటికే నిమ్స్ చికిత్స పొందుతున్న హుమేరా ఫాతిమా, రుక్సానా, జ్యోతితో పాటు మంగళవారం సాయంత్రం లక్ష్మి ప్రియ, సునీతలను నిజామాబాద్ నుంచి నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం వీరికి డయాలసిస్ చేస్తూ చికిత్స అందిస్తున్నారు.

    *నిమ్స్ ప్రొఫెసర్లతో కారణాలపై విచారణ.*
    *
    ఒకేసారి 5గురు బాలింతలు ఒకే రకమైన సమస్యతో అస్వస్థతకు గురవడంపై ప్రిన్సిపల్ సెక్రటరీ సీరియస్గా స్పందించారు. కారణాలను కనుగొనేందుకు మంగళవారం ఇద్దరు ప్రొఫెసర్లను, డైరెక్టర్ ను నిమ్స్ కు పంపారు. వారు బాధితుల ఆరోగ్యాన్ని, వాడిన మందులు, శస్త్ర చికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బాన్సవాడకు వచ్చి ఇక్కడి ఆపరేషన్ థియేటర్ ను, సిజెరియన్ కు వాడిన పరికరాలను పరిశీలించారు. సిబ్బంది తో మాట్లాడారు. వివిధ మందులు, పరికరాలను ల్యాబ్ టెస్ట్ నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్లారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి