బాన్సువాడ: ఐదుగురు బాలింతలు అస్వస్థతపై ప్రభుత్వం సీరియస్. - ఇద్దరు నర్సులు సస్పెండ్, అనస్థీషియా డాక్టర్ విధుల నుంచి తొలగింపు.

వేగుచుక్క న్యూస్: బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారని ఉన్నత అధికారుల విచారణలో తేలింది. దీనితో ప్రభుత్వ ఘటనకు బాధ్యులుగా ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయగా, అనస్థీషియా డాక్టర్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత 15 రోజుల క్రితం శుక్ర, శనివారాల్లో చేసిన 10 సిజెరియన్లలో 5గురు బాలింతలు ఆపరేషన్ అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని నిర్ధారించారు. విచారణ నివేదిక ప్రకారం శస్త్రచికిత్సా పరికరాలు, లినెన్ సరైన స్టెరిలైజేషన్...