EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జర్నలిస్టుల సమస్యలపై "ఉద్యమం తీవ్రతరం" చేస్తాం. - టిడబ్ల్యూ జెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్ హెచ్చరిక.

    Author admin | 13 Jul 2026, 05:58 PM | TELANGANA
    జర్నలిస్టుల సమస్యలపై "ఉద్యమం తీవ్రతరం" చేస్తాం.  - టిడబ్ల్యూ జెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్ హెచ్చరిక.

    - జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలీ.

    - అర్హులైన ప్రతిఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీచేయాలి.

    జర్నలిస్టుల సమస్యలపై "ఉద్యమం తీవ్రతరం" చేస్తాం.  - టిడబ్ల్యూ జెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్ హెచ్చరిక. - Additional Image

    - జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలనీ డిమాండ్.

    ఇవి కూడా చదవండి

    - టిడబ్ల్యూ జెఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన.

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై పాలకుల నిర్లక్ష్య వైఖరి వీడాలని, జిల్లా కేంద్రంతో పాటు మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని, టిడబ్ల్యూ జెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని లేదంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం జర్నలిస్టులు నిరసన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంచె వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, మాట్లాడుతూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జర్నలిస్టులు కృషిచేస్తున్నారని తెలిపారు. ఎండనక, వాననక విధుల్లో ఉంటున్నారనీ, తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడారన్నారు. ఉద్యమం సందర్భంగా, ఆ తరువాత కూడా వందలాది మంది చనిపోయారు. పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వాల విధానాలు మారిపోతున్నాయి. కానీ, జర్నలిస్టుల బతుకుల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఉన్న రెండు వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను యూనియన్ గవర్నమెంట్ కోడ్ల కింద మార్చేసి హక్కులను కాలరాసీ, కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. అటు యూనియన్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందడం లేదన్నారు. చివరకు వృత్తి నిర్వహణకు కావాల్సిన అక్రిడిటేషన్ కార్డులు సైతం సకాలంలో ఇవ్వడం లేదనీ, అనేక ఉద్యమాల ఫలితంగా గత రెండు నెలల నుంచి అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తున్నారనీ అన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీచేయాలనీ, అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకూ కార్డు ఇవ్వాలన్నారు. ఒకే యూనియన్ నుంచి ప్రాతినిథ్యం వహించే వారిని అక్రిడిటేషన్ కమిటీల నుంచి తొలగించాలనీ, అందరికి సమాన ప్రాతినిథ్యం కల్పించాలనీ డిమాండ్ చేశారు.

    *హెల్త్ కార్డులు తక్షణమే ఇవ్వాలి.*

    ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నరలిస్టుకూ తక్షణమే హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కంట్రిబూషన్ ను ప్రభుత్వమే జర్నలిస్టుల తరపున చెల్లించాలనీ, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇండ్లస్థలాలు వెంటనే ఇవ్వాలనీ, యుద్ధప్రాతిపదికన ప్రక్రియకు శ్రీకారం చుట్టి జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలనీ. రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం మోడీ సర్కార్ పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలనీ తదితర ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, లక్ష్మణ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి