జర్నలిస్టుల సమస్యలపై "ఉద్యమం తీవ్రతరం" చేస్తాం. - టిడబ్ల్యూ జెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్ హెచ్చరిక.
- జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలీ. - అర్హులైన ప్రతిఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీచేయాలి. - జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలనీ డిమాండ్. - టిడబ్ల్యూ జెఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలపై పాలకుల నిర్లక్ష్య వైఖరి వీడాలని, జిల్లా కేంద్రంతో పాటు మండల జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని, టిడబ్ల్యూ జెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని లేదంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్...