EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యారంగం పట్ల సర్కార్ నిర్లక్ష్యం* *రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం*

    Author admin | 05 Jul 2026, 04:45 PM | TELANGANA, ఎడ్యుకేషన్
    విద్యారంగం పట్ల సర్కార్ నిర్లక్ష్యం*  *రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం*

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు..
    ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే. అషూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు.
    విద్య అనేది ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా నేడు విద్య వ్యాపారంగా మారిపోయిందని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని విస్మరించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
    ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కాకుండా వాటిని బలోపేతం చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 25 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
    ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షురాలు డి.దీపిక, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రఘురాం, ఏఐపీఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. అనిల్, PDSU జిల్లా సహాయ కార్యదర్శి వినోద్,AISF జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్,జిల్లా నాయకుడు కిషొర్, PDSU నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్,జిల్లా నాయకులు మనోజ్, నగర నాయకులు గౌరవ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి