విద్యారంగం పట్ల సర్కార్ నిర్లక్ష్యం* *రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం*
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే. అషూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందక...