EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈ నెల 6, 7 న హైదరాబాద్ లో పెన్షనర్ల జాతీయ సమావేశాలు*

    Author admin | 05 Jul 2026, 04:01 PM | NATIONAL, TELANGANA
    ఈ నెల 6, 7 న హైదరాబాద్ లో పెన్షనర్ల జాతీయ సమావేశాలు*

    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 6 ,7 తేదీల్లో ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం నిజామాబాద్ పెన్షనర్స్ భవన్ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆల్ పర్సనల్స్ &రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి ఈ సమావేశంలో ప్రతినిధులు పాల్గొంటారని, ముఖ్యంగా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, కమిటీషన్ 12 సంవత్సరాల కుదించాలని, రిటైర్డ్ ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలని, రైల్వే ప్రయాణాల్లో రాయితీని పునరుద్ధరించాలని తదితర ప్రధాన డిమాండ్లను ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తారని తెలిపారు. విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కే. రామ్మోహన్రావు, జిల్లా అధ్యక్షులు శిల్ప హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి నారాయణ, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రాధా కిషన్, సాంబశివరావు, శ్రీమతి పుష్పవల్లి, జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తమరావు, బట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి