ఈ నెల 6, 7 న హైదరాబాద్ లో పెన్షనర్ల జాతీయ సమావేశాలు*
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 6 ,7 తేదీల్లో ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం నిజామాబాద్ పెన్షనర్స్ భవన్ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆల్ పర్సనల్స్ &రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి ఈ సమావేశంలో ప్రతినిధులు పాల్గొంటారని, ముఖ్యంగా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, కమిటీషన్ 12 సంవత్సరాల కుదించాలని, రిటైర్డ్ ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలని, రైల్వే ప్రయాణాల్లో రాయితీని పునరుద్ధరించాలని తదితర ప్రధాన డిమాండ్లను ఈ సమావేశంలో చర్చించి కార్యాచరణ...