EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈనెల 13న కలెక్టరేట్ల ఎదుట నిరసన 15న సమాచార కమిషనర్‌ ‌కార్యాలయం వద్ద ధర్నా టీడబ్ల్యూజేఎఫ్‌ ‌రాష్ట్ర కార్యవర్గం పిలుపు ఆగస్టు నెలాఖర్‌‌లో రాష్ట్ర మహాసభలు

    Author admin | 05 Jul 2026, 08:13 AM | TELANGANA
    ఈనెల 13న కలెక్టరేట్ల ఎదుట నిరసన    15న సమాచార కమిషనర్‌ ‌కార్యాలయం వద్ద ధర్నా   టీడబ్ల్యూజేఎఫ్‌ ‌రాష్ట్ర కార్యవర్గం పిలుపు    ఆగస్టు నెలాఖర్‌‌లో రాష్ట్ర మహాసభలు

    వేగుచుక్క న్యూస్, హైదరాబాద్:
    జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టు ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ పిల్లి రాంచందర్‌, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు. ఈనెల 13న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసి నిరసనలు తెలిపాలని కోరారు. 15న రాష్ట్ర సమాచార కమిషనర్‌ ‌కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌‌లోని త్యాగరాయ గానసభలో యాక్టింగ్‌ అధ్యక్ష‍ులు పిల్లి రాంచందర్‌ అధ్యక్ష‍త టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జర్నలిస్టుల హెల్త్‌‌కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు . హెల్త్‌ కార్డులు నిమ్స్‌ ఆస్ప్రతి మినహా ఏ ఇతర కార్పొరేట్‌ ఆస్ప్రతుల్లో పని చేయడం లేదని వ్యాఖ్యనించారు. వెంటనే జర్నలిస్టులందరికీ నూతన హెల్త్‌‌కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఇండ్ల స్థలాలపై నిర్ణయం తీసుకోకపోవడంతో కార్యాచరణ ముందుకు సాగడం లేదని తెలిపారు. ఇండ్ల స్థలాల విషయంలో సర్కారు జర్నలిస్టులకు ఆశలు కల్పించి ఆ తర్వాత వారి ఆశలపై నీళ్లు చల్లుతోందని విమర్శించారు. అక్రిడిడేషన్‌ ‌కార్డుల పంపిణీ ఆలస్యమవుతున్నదని, అర్హులైన జర్నలిస్టులకు వెంటనే అక్రిడిడేషన్‌ ‌కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అక్రిడేషన్‌ ‌కార్డులు ఆలస్యం కావడంతో బస్‌‌పాసులు రాక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తేచేశారు. జర్నలిస్టులకు పెన్షన్‌ ‌రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రయివేట్‌, కార్పొరేట్‌ ‌విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.


    ఆగస్టు నెలఖారులో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర మహాసభలు.

    జూలై నెలఖారు వరకు అన్ని జిల్లాల మహాసభలు, ఆగస్టు నెలఖారులో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. మహాసభలను విజయవంతం చేసేందుకు యాక్టింగ్‌ ‌ప్రెసిండెంట్‌ పిల్లి రాంచందర్‌ను మహాసభ నిర్వహణకు ఆహ్వాన సంఘం కన్వీనర్ గా రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకుంది. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్, తాటికొండ కృష్ణ, మానిక్ ప్రభు, గుడిగ రఘు, రాజశేఖర్, కార్యదర్శి సలీమ, చంద్రశేఖర్, నవీన్, అరుణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి