ఈనెల 13న కలెక్టరేట్ల ఎదుట నిరసన 15న సమాచార కమిషనర్‌ ‌కార్యాలయం వద్ద ధర్నా టీడబ్ల్యూజేఎఫ్‌ ‌రాష్ట్ర కార్యవర్గం పిలుపు ఆగస్టు నెలాఖర్‌‌లో రాష్ట్ర మహాసభలు

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్టు ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ పిల్లి రాంచందర్‌, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు. ఈనెల 13న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసి నిరసనలు తెలిపాలని కోరారు. 15న రాష్ట్ర సమాచార కమిషనర్‌ ‌కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌‌లోని త్యాగరాయ గానసభలో యాక్టింగ్‌ అధ్యక్ష‍ులు పిల్లి రాంచందర్‌ అధ్యక్ష‍త టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జర్నలిస్టుల హెల్త్‌‌కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు . హెల్త్‌ కార్డులు...