EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిరుద్యోగులు "పోరుబాట" కు సిద్ధం.... రెండు లక్షల ఉద్యోగాల సాధనకై ఈ నెల 7న ఓయూలో ర్యాలీ.. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు..

    నిరుద్యోగులు "పోరుబాట" కు సిద్ధం.... రెండు లక్షల ఉద్యోగాల సాధనకై ఈ నెల 7న ఓయూలో ర్యాలీ.. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు..

    నిరుద్యోగులు "పోరుబాట" కు సిద్ధం.

    ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు తక్షణమే విడుదలకు డిమాండ్.

    నిరుద్యోగులు "పోరుబాట" కు సిద్ధం.... రెండు లక్షల ఉద్యోగాల సాధనకై ఈ నెల 7న ఓయూలో ర్యాలీ.. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు.. - Additional Image

    - రెండు లక్షల ఉద్యోగాల సాధనకై ఈ నెల 7న ఓయూలో ర్యాలీ..

    - నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు..

    వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగులు పలు డిమాండ్లతో "పోరుబాట" కు సిద్ధం అవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ తో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్నారు. మొదటగా ఈ నెల 7న ఓయూలో ర్యాలీ చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా, సమావేశానికి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఓయూ రీసర్చ్ స్కాలర్ ఆర్ ఎల్ మూర్తి అధ్యక్షత వహించారు.

    ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ వివిధ విద్యార్థుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ, పాలకవర్గాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రశ్నిస్తే ఆలోచనలను తుంచేసేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నారని నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఐక్యతంగా కొట్లాడాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రశ్నను నిర్బంధించడం ఎవరి వల్ల సాధ్యం కాదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలతోనే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చాలని నిరుద్యోగ జేఏసీ నిర్వహించినా ఈ కార్యక్రమానికి అభినందనలు తెలిపారు.

    *ప్రొఫెసర్ బినవేని రామ్ షెఫర్డ్ మాట్లాడుతూ,*

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తూ, తెలంగాణ దెబ్బతీస్తున్నారని, త్యాగాల తెలంగాణను కార్పొరేట్ వర్గాలకు వ్యాపార మయము చేస్తున్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేవలం పోరాటాలకే పరిమితం కాకుండా రాజకీయాలు చేపట్టాలని, ప్రత్యమ్నయ రాజకీయ వేదిక లాంటివి ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యంగా విద్యార్థులు విద్యార్థుల సంఘాలు పోరాట నిర్వహించాలని అన్నారు.

    ఇవి కూడా చదవండి

    *నిరుద్యోగ జేఏసీ రాష్ట్రకన్వీనర్ మూర్తి మాట్లాడుతూ,*

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండున్నర సంవత్సరాలైనా నిరుద్యోగులను మోసం చేస్తుందని దగా చేస్తుందని తెలియజేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, మిగతావన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఉద్యోగాలు అని అన్నారు. నిరుద్యోగులను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నం అవుతుందని అన్నారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి ఆరు నెలలు గడిచిన ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని, తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిరక్షణ కోసం నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేస్తాయని తెలియజేశారు. కాంగ్రెస్ పాలన కూడా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి నెలకొందని రాహుల్ గాంధీ తక్షణమే జోక్యం చేసుకొని నిరుద్యోగ హామీల నెరవేర్చలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వాన్ని నిరుద్యోగులు నిలదీస్తారని హెచ్చరించారు
    కార్యక్రమంలో డిబిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు దర్శన్, ఎస్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వేదాంత మౌర్య, ఎస్ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు నవీన్, 42 శాతం బీసీ రిజర్వేషన్ల కన్వీనర్ వేణు కుమార్, నిరుద్యోజేశి రాష్ట్ర నాయకులు ఉపేందర్, కాశీ, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు కిరణ్, మనోజ్, రితీష్, బీసీ ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సైదులు యాదవ్ ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, నిరుద్యోగ నాయకురాలు అనిత, డిఎస్ఎఫ్ఐ దిలీప్, పరిశోధక విద్యార్థులు సునీల్ శెట్టి, రాహుల్, భాష, వినోద్,అంజి, ధర్మ బిక్షం ప్రవీణ్, అంజి
    తదితరులు పాల్గొన్నారు

    *డిమాండ్స్ :*

    ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.1000 కోట్లు వెంటనే విడుదల చేయాలి.

    రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డిగ్రీ లెక్చరర్ (DL), జూనియర్ లెక్చరర్ (JL), DSC, SI, పోలీస్ మరియు అన్ని శాఖల ఖాళీ పోస్టులకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి.
    ప్రతి సంవత్సరం నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.

    ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.

    రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.5,000 నిరుద్యోగ భృతి అందించాలి.
    రాజీవ్ యువ వికాస్ పథకం లబ్ధిదారులకు మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలి.

    అత్యధికంగా చదివినవి