EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి..సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్.

    Author admin | 16 Nov 2026, 06:59 PM | TELANGANA
    ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి..సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్.

    - సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 1న చలో ఢిల్లీ.

    వేగుచుక్క న్యూస్, కామారెడ్డి: ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

    ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు సమాజానికి అందిస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే రూ.26 వేల కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

    ఇవి కూడా చదవండి

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఈ అంశాలను పొందుపరిచినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

    ఈ ధర్నాలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందిర, రాజశ్రీతో పాటు నాయకులు మమత, ప్రమీల, లలిత, భాగ్యలక్ష్మి, వరలక్ష్మి, భాగ్య, యశోద, నాగమణి, గంగమణి, స్వప్న, కృష్ణవేణి, లత, అనిత, విజయ, సుమలత, మంజుల, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి