EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కరువు మండలాలకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలి...టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత.

    Author admin | 16 Nov 2026, 04:35 PM | TELANGANA
    కరువు మండలాలకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలి...టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత.

    తెలంగాణపై ఎల్నినో ప్రభావం తీవ్రం..

    -
    - రేవంత్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు.. ప్రధాని మోదీని కలిసినా కరువుపై ప్రస్తావించలేదు.

    - హరీశ్ రావు అవినీతిపై అన్ని ఆధారాలు సీఎంకు అందజేస్తాం.

    - ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం మా యాత్ర.


    వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: తెలంగాణపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రాష్ట్రంలోని కరువు మండలాల్లో రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రస్తావించలేదని, కాంట్రాక్టుల గురించి తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడలేదని ఆరోపించారు.

    ఇవి కూడా చదవండి

    *హరీశ్ రావుపై మరోసారి విమర్శలు*

    మాజీ మంత్రి హరీశ్‌రావు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను ముఖ్యమంత్రికి అందజేస్తామని కవిత వెల్లడించారు. విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీసీఐడీకి లేఖల ద్వారా ఆధారాలు సమర్పిస్తున్నామని తెలిపారు. హరీశ్‌రావును ప్రజాక్షేత్రంలోనే ప్రశ్నించడంతో పాటు న్యాయపరంగానూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడింది ఎవరైనా నిజాలు నిగ్గు తేలాల్సిందేనని స్పష్టం చేశారు.

    *ఉచిత విద్య, వైద్యం కోసం యాత్ర*

    ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో తమ యాత్ర కొనసాగుతుందని కవిత తెలిపారు. భైరవ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇంటర్మీడియట్ బోర్డు రద్దు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

    *కాంగ్రెస్‌పై విమర్శలు* .

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరుద్యోగులను మోసం చేశారని కవిత ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

    అత్యధికంగా చదివినవి