EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నల్లగొండ... "ఎర్ర’గొండ". - ఎఐకెఎస్ జాతీయ మహాసభల సందర్బంగా రైతుల మహా ప్రదర్శన.

    Author admin | 15 Nov 2026, 11:19 PM | TELANGANA
    నల్లగొండ... "ఎర్ర’గొండ".  - ఎఐకెఎస్ జాతీయ మహాసభల సందర్బంగా రైతుల మహా ప్రదర్శన.

    - కదంతొక్కిన కర్షకులు ఎరుపెక్కిన జిల్లా కేంద్రం.

    - ఎడ్లబండ్లపై ర్యాలీగా అగ్ర నేతలు.. థింసా, లంబాడీ నృత్యం, కోయడప్పు, కోలాటం..

    నల్లగొండ... "ఎర్ర’గొండ".  - ఎఐకెఎస్ జాతీయ మహాసభల సందర్బంగా రైతుల మహా ప్రదర్శన. - Additional Image

    - మర్రిగూడ బైపాస్‌ నుంచి ఎన్‌‌జి కాలేజ్‌ ప్రాగణం వరకు మహా ప్రదర్శన.

    ఇవి కూడా చదవండి

    వేగుచుక్క న్యూస్, నల్గొండ: అఖిల భారత కిసాన్‌ ‌సభ (ఎఐకెఎస్‌) 36వ జాతీయ మహాసభల సందర్భంగా నల్లగొండ పట్టణం ‘ఎర్ర’గొండగా మారింది. మహాసభల ప్రారంభం సందర్భంగా ఆదివారం నల్లగొండ నగర శివారు మర్రిగూడ బైపాస్‌ సెంటర్‌ వద్ద మహా ప్రదర్శనను ఎఐకెఎస్‌ ‌జాతీయ ప్రదాన కార్యదర్శి డా.విజ్జుకృష్ణన్‌ ‌జెండా ఊపి ప్రారంభించారు. ఎన్‌‌జి కాలేజ్‌ ప్రాగణం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు నిర్వహించిన ర్యాలీలో కర్షకులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్ధులు,యువత,మహిళలు, వృద్దులు, చిన్నారులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఎఐకెఎస్‌ ‌జెండాలు చేతబట్టి ఎర్రజెండా పాటలతో ఉత్సాహంగా కదంతొక్కారు. ప్రదర్శనలో రెడ్‌ ‌షర్ట్‌ ‌వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారిపొడుగునా ఆదివాసీ సంప్రదాయ థింసా నృత్యాన్ని మహిళలు డప్పు దరువులకు లయబద్దంగా ప్రదర్శించారు. లంబాడీ సంప్రదాయ నృత్యం, మహిళల కోలాటం ఆట,పాటలతో ప్రదర్శన దద్దరిల్లింది. రైతాంగ పోరాట అమరులను స్మరించుకుంటూ సాగిన ప్రదర్శన ఆద్యంతం స్ఫూర్తివంతంగా, అత్యంత క్రమశిక్షణగా సాగింది. రైతుల మహాప్రదర్శనలో మాజీ ఎంపి బృందా కారత్‌, ఎఐకెఎస్‌ ‌జాతీయ అధ్యక్షులు డా.అశోక్‌ ‌ధావలే, ఎఐకెఎస్‌ ‌జాతీయ ప్రధాన కార్యదర్శి డా. విజూ కృష్ణన్‌, మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ ‌రావు,ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రైతు సంఘం నాయకులు ఎండి జహంగీర్‌, సుధాకర్‌ ‌రెడ్డి,విద్యార్ధి,యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతు సంఘం నేతలపై స్థానిక ప్రజలు అడుగడుగునా బోనాలు,బతుకమ్మలతో స్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. ఆహ్వాససంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, కెవిపిఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌ ‌వెస్లీ, మాజీ ఎమ్మెల్సీ ఎడ్లబండ్లపై ర్యాలీగా ప్రదర్శనకు వచ్చారు.

    నల్లగొండ... "ఎర్ర’గొండ".  - ఎఐకెఎస్ జాతీయ మహాసభల సందర్బంగా రైతుల మహా ప్రదర్శన. - Additional Imageనల్లగొండ... "ఎర్ర’గొండ".  - ఎఐకెఎస్ జాతీయ మహాసభల సందర్బంగా రైతుల మహా ప్రదర్శన. - Additional Imageనల్లగొండ... "ఎర్ర’గొండ".  - ఎఐకెఎస్ జాతీయ మహాసభల సందర్బంగా రైతుల మహా ప్రదర్శన. - Additional Image
    అత్యధికంగా చదివినవి