EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గడ్కోల్ నుంచి గ్లోబల్ స్థాయికి.. "శ్రీనివాస్ గౌడ్‌కు అంతర్జాతీయ గుర్తింపు." - ‘గ్లోబల్ 200 ఇన్‌స్పిరేషనల్ లీడర్స్–2026’ జాబితాలో నిజామాబాద్ వాసికి చోటు.

    Author admin | 14 Nov 2026, 07:57 PM | TELANGANA
    గడ్కోల్ నుంచి గ్లోబల్ స్థాయికి.. "శ్రీనివాస్ గౌడ్‌కు అంతర్జాతీయ గుర్తింపు."  - ‘గ్లోబల్ 200 ఇన్‌స్పిరేషనల్ లీడర్స్–2026’ జాబితాలో నిజామాబాద్ వాసికి చోటు.

    - దుబాయ్ ఆర్థిక రంగంలో తెలుగు పారిశ్రామికవేత్తగా ప్రత్యేక గుర్తింపు.

    - బ్యాంకింగ్, సంపద నిర్వహణ రంగాల్లో 25 ఏళ్ల అపార అనుభవం.

    గడ్కోల్ నుంచి గ్లోబల్ స్థాయికి.. "శ్రీనివాస్ గౌడ్‌కు అంతర్జాతీయ గుర్తింపు."  - ‘గ్లోబల్ 200 ఇన్‌స్పిరేషనల్ లీడర్స్–2026’ జాబితాలో నిజామాబాద్ వాసికి చోటు. - Additional Image

    - ఎంఈఎన్ఎస్ఎ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవోగా అంతర్జాతీయ నాయకత్వం.

    - "ఎస్ఆర్ఐఎన్ఐ ఫౌండేషన్" ద్వారా జన్మభూమి అభివృద్ధికి విశేష కృషి.

    వేగుచుక్క న్యూస్,
    నిజామాబాద్ ప్రతినిధి: పల్లె గడప నుంచి ప్రపంచ ఆర్థిక రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన నిజామాబాద్ జిల్లా వాసి శ్రీనివాస్ గౌడ్ రాచకొండకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన ఆయనను ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ 200 ఇన్‌స్పిరేషనల్ లీడర్స్–2026’ జాబితాలో ఎంపిక చేసినట్లు వైట్ పేజ్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఈఎన్ఎస్ఎ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఆయన అందిస్తున్న సేవలకు ఈ గుర్తింపు దక్కింది. గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్, మల్టీ ఫ్యామిలీ ఆఫీస్ అడ్వైజరీ, సామాజిక ప్రభావ నాయకత్వం వంటి రంగాల్లో ఆయన సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుని ఈ గౌరవాన్ని ప్రకటించారు.

    *గ్రామీణ నేపథ్యం నుంచి అంతర్జాతీయ ప్రస్థానం.*

    సాధారణ గ్రామీణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ తన కృషి, పట్టుదల, నైపుణ్యంతో అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బ్యాంకింగ్, సంపద నిర్వహణ, ఆర్థిక సేవల రంగాల్లో సుమారు 25 ఏళ్ల అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. యుబిఎస్, సిటీబ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, ఐసిఐసిఐ, మష్రెక్ ప్రైవేట్ బ్యాంకింగ్ వంటి ప్రముఖ సంస్థల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సుదీర్ఘ అనుభవంతో 2022లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఎంఈఎన్ఎస్ఎ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ సంస్థను స్థాపించారు. 2023లో దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ నుంచి నియంత్రణ అనుమతి పొందిన ఈ సంస్థ ద్వారా అంతర్జాతీయ ఖాతాదారులకు సంపద నిర్వహణ, పెట్టుబడుల సలహాలు, ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన సేవలు అందిస్తున్నారు.

    *గతంలోనూ పలు అంతర్జాతీయ గుర్తింపులు.*

    శ్రీనివాస్ గౌడ్ నాయకత్వ ప్రతిభకు గతంలోనూ పలు గుర్తింపులు లభించాయి. 2024లో ఇండియా టుడే గ్రూప్, ఆజ్ తక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఐకాన్స్ ఆఫ్ ది యూఏఈ’ పురస్కార గుర్తింపును అందుకున్నారు. ఎంఈఎన్ఎస్ఎ సంస్థకు 2024, 2025, 2026 సంవత్సరాల్లో సిటీ వైర్ మిడిల్ ఈస్ట్ నుంచి గుర్తింపు లభించినట్లు వైట్ పేజ్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.

    *జన్మభూమి అభివృద్ధే లక్ష్యంగా "ఎస్ఆర్ఐఎన్ఐ ఫౌండేషన్."*

    అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానానికి ఎదిగినా తన పుట్టిన ఊరును, గ్రామీణ సమాజాన్ని ఆయన మరచిపోలేదు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో 2025 అక్టోబర్‌లో ‘సస్టైనబుల్ రూరల్ ఇనిషియేటివ్స్ ఫర్ నర్చరింగ్ ఇండియా’ (ఎస్ఆర్ఐఎన్ఐ ఫౌండేషన్) పేరుతో సామాజిక సేవా సంస్థను స్థాపించారు.

    ‘గ్రాస్‌రూట్స్ టు రైజ్’ అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల సాధికారత కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది.

    ఇప్పటికే గడ్కోల్ గ్రామంలో సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించడంతో పాటు అన్నదానం, చిన్నతరహా ఉపాధి అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. తన తండ్రి, ఎస్ఆర్ఐఎన్ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు దేవా గౌడ్ రాచకొండ, సతీమణి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక సహకారంతో గ్రామీణ కుటుంబాల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

    అత్యధికంగా చదివినవి