EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి..- ఆర్ట్స్ కాలేజీలో రౌండ్ టేబుల్ సమావేశం.

    Author admin | 14 Nov 2026, 07:14 PM | TELANGANA
    ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను  పరిష్కరించాలి..- ఆర్ట్స్ కాలేజీలో రౌండ్ టేబుల్ సమావేశం.

    - 20 రోజులుగా కొనసాగుతున్న ఉద్యోగుల పోరాటానికి ఓయూ విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థుల మద్దతు.

    వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు గత 20 రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న పోరాట కార్యక్రమాలకు ఓయూ విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఓయూ విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో నాన్ టీచింగ్ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని, యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగులు అనేక ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంట్రాక్టు, టైమ్ స్కేల్, ఔట్‌సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇవి కూడా చదవండి

    *నాన్ టీచింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను నాయకులు ప్రస్తావించారు.*

    2001 నుంచి 2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయడంతో పాటు, 01-09-2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.
    ఎన్జీవోలు, టెక్నికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పెండింగ్ ప్రమోషన్లు, పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, యూనివర్సిటీ బిల్డింగ్ డివిజన్ అధికారులకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
    కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి, అర్హులైన ఉద్యోగులకు టైమ్ స్కేల్ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ప్రయోజనాలను అందించాలని కోరారు.
    ఏప్రిల్ 2023 నుంచి నిలిపివేసిన కాంట్రాక్టు ఉద్యోగుల నెలవారీ రూ.1,500 వార్షిక ఇంక్రిమెంట్లను బకాయిలతో సహా చెల్లించాలని పేర్కొన్నారు.
    అక్టోబర్ 2023 నుంచి నిలిపివేసిన ట్రైనింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్, మరణానంతర ఆర్థిక ప్రయోజనాలను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచి అందించాలని కోరారు. మరణించిన 41 మంది కుటుంబాలకు, రిటైర్ అయిన 8 మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని అన్నారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితిని రూ.10,000 నుంచి రూ.30,000కు పెంచాలని, ఉద్యోగ సంఘాలు సమర్పించిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.
    ఉద్యోగంలో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, కనీసం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

    రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను ఇప్పటివరకు విడుదల చేయకపోవడం విచారకరమని నాయకులు విమర్శించారు. యూనివర్సిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రకటించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

    ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎస్ఎఫ్ఐ ఓయూ ఉపాధ్యక్షులు కిరణ్, ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు ఉదయ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రాంతి దళ్ రాష్ట్ర అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్,మన తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు,నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆర్.ఎల్. మూర్తి, ప్రొఫెసర్ వెంకట్ దాస్, ప్రొఫెసర్ నతనియల్, డా.బక్క జడ్సన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్య, జర్జ్ రెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు, టీవీయూవీ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల బద్రి, పీడీఎస్యూ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి మహేష్, ఏఐఓబీసీ అధ్యక్షులు మహేష్,బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ శీను, నాన్ టీచింగ్ జేఏసీ నాయకులు డా కుమార్, అధ్యక్షులు ఖాదీర్ ఖాన్, వెంకటేష్, ప్రేమ్, రాజేష్, పవన్, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి