ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు.. కనీస వేతనాలు అమలు చేయాలి. - ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయాలనీ ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్ (ఇన్స్ట్రక్టర్), ఆయాల జిల్లా స్థాయి సమావేశం ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందించడానికి, విద్యార్థులను పాఠశాలకు అలవాటు చేయడానికి ప్రీ ప్రైమరీ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీరికి అతి తక్కువ గౌరవ వేతనం నిర్ణయించి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని...