*2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి* - టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్. - సీఎస్ కు వినతిపత్రం అందజేసిన నేతలు.

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలనీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి, డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, నూతన ఆరోగ్య పథకం మార్గదర్శకాలను రూపొందించిఉద్యోగులకు వెంటనే...