పెర్కిట్‌లో అంగరంగ వైభవంగా... "నాయకపోడ్ శ్రీశ్రీ భీమన్న" ఉత్సవ దర్బార్.నాయకపోడ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధుల హామీ.
- ఐదవ మహాసభకు పోటెత్తిన ఆదివాసీ నాయకపోడ్ ప్రజలు.. 8 వేల మందితో జనసంద్రంగా మారిన పెర్కిట్. వేగుచుక్క న్యూస్, ఆర్మూర్, నవంబర్ 20: ఆదివాసీ నాయకపోడ్ సమాజ ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా నిర్వహించిన శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్, ఐదవ మహాసభ పెర్కిట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. నాయకపోడ్ సేవా సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని శ్రీశ్రీ భీమన్న దేవాలయం వద్ద ఈ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8 వేల మంది...