మెతుకు దొరకని దీనస్థితి నుంచి... మెజిస్ట్రేట్ గా "తలారి బాలయ్య".నాంపల్లి కోర్టు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా నియామకం.
- పేదరికాన్ని జయించి న్యాయరంగంలో ఉన్నత శిఖరాలకు.. - చిన్ననాటి కష్టాలను అధిగమించి తుజాల్ పూర్ గ్రామానికి గర్వకారణంగా నిలిచిన విజయ ప్రస్తానం. " సంకల్పం బలంగా ఉంటే పేదరికం కూడా విజయానికి అడ్డుకాదని నిరూపించారు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది తలారి బాలయ్య. మెతుకు దొరకని దీనస్థితి నుంచి... మెజిస్ట్రేట్ గా ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల మధ్య వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదువును కొనసాగించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి న్యాయరంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. సుదీర్ఘ న్యాయవాద అనుభవం, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అందించిన సేవలను...