రేవంత్ రెడ్డి రెండు నెలలు టైం ఇస్తున్నాం.. * రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందే.ఏఐకేఎస్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్.
* లేకుంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మందితో పాదయాత్ర చేపడతాం. - రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలం - ఏఐకేఎస్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్. వేగుచుక్క న్యూస్, నల్గొండ: తెలంగాణలోని రైతులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, రైతుల సమస్యలను రెండు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలనీ, లేదంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మంది రైతులతో మహాపాదయాత్ర చేపడతామని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ ప్రకటించారు. ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభను పురస్కరించుకొని నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో...