మోడీ జమానాలో కొత్త భూస్వామ్యం.కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు. - నల్గొండలో ఎఐకెఎస్ బహిరంగ సభలో వక్తల పిలుపు.
ఎరుపెక్కిన "నల్గొండ"... - రైతు భూముల బలవంతపు ఆక్రమణ. - నగరంలో భారీ ర్యాలీ, కదం తొక్కిన అన్నదాతలు. వేగుచుక్క న్యూస్ - నల్గొండ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పన్నెండేళ్ల ఏలుబడిలో అమలు చేస్తున్న వేగవంతమైన పెట్టుబడీ దారీ వ్యవసాయ విధానం దేశంలో కొత్త భూస్వామ్య వ్యవస్థను పాదుకొల్పుతోందని, ఆ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) నల్గొండలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగసభలో వక్తలు పిలుపునిచ్చారు. ఎనభై శాతంగా ఉన్న చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతుల భూములను బలవంతంగా గుంజుకొని కార్పొరేట్లకు అప్పగించడం వలన భూమి కేంద్రీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. నాటి భూస్వాములు,...