జేసిఎస్ ప్రసాద్ త్యాగం.. భారత "విప్లవోద్యమంలో చెరగని ముద్ర." - ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి. పాపారావు.
వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: భారత విప్లవోద్యమంలో జార్జిరెడ్డి అడుగుజాడల్లో నడిచిన, పిడిఎస్ యు నిర్మాత జంపాలా చంద్రశేఖర ప్రసాద్ చేసిన త్యాగం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోతుందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డి. పాపారావు అన్నారు. జంపాలా చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ గ్రంథాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో జంపాలా చంద్రశేఖర ప్రసాద్ స్మారకోపన్యాస సభను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన డి. పాపారావు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా, బోధన్ డివిజన్ లోని ఎత్తోండ గ్రామానికి చెందిన జంపాలా చంద్రశేఖర ప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పిడిఎస్ యు విద్యార్థి సంఘంను స్థాపించి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, ప్రజా సమస్యలపై పోరు...