నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో.. ఘనంగా "బాలల దినోత్సవ వేడుకలు".

- రెండు రోజుల పాటు ఆటలు, వివిధ అంశాల్లో పోటీలు.. విజేతలకు బహుమతుల ప్రదానం. వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు రెండు రోజుల పాటు వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. శనివారం నిర్వహించిన ముగింపు వేడుకలు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల రవీందర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జరుపుకునే బాలల దినోత్సవం విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుందన్నారు. చాలా ఏళ్ల తర్వాత...